ఎవ్వరేం అనుకున్నా బేఫికర్ అంటున్నారు జాన్వీ కపూర్. తనవైపు వేలెత్తి చూపించడానికి ఎంతో మంది రెడీగా ఉంటారని, వాటన్నిటిని పట్టించుకుంటూ కూర్చుంటే అయ్యే పని కాదని అంటున్నారు జాన్వీ కపూర్.
ధాకడ్ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు జాన్వీ కపూర్. ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కూడా మిలి, రూహి, గుడ్‌లక్ జెర్రీ, గుంజన్ సక్సేనా వంటి సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఎప్పుడు ఎక్కడ కనిపించినా తనని ఏదో ఒకటి అడగడానికి మీడియా ప్రయత్నిస్తూనే ఉంటుందని అన్నారు జాన్వీ కపూర్. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పార్టిసిపేట్ చేశారు జాన్వీకపూర్. తన తల్లిదండ్రుల వల్లనే తనకు మీడియా అటెన్షన్ ఎక్కువగా ఉంటుందని అన్నారు.
దీని గురించి జాన్వీ మాట్లాడుతూ "నేను యారొగెంట్‌గా మాట్లాడటం లేదు. జనాలతో డిస్‌కనెక్ట్ కావాలని కూడా అనుకోవడం లేదు. కానీ, ఎక్కడికి వెళ్లినా ఎప్పుడూ ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏం తప్పు చేస్తుందా? వేలెత్తి చూపిద్దామా అని అనుకుంటూనే ఉంటారు. దీనివల్ల నా మీద ఎక్స్ ట్రా ప్రెజర్ ఉంటూనే ఉంటుంది. నేను జిమ్‌కి వెళ్లినా, పబ్లిక్ ప్లేస్‌లో ఎక్కడ కనిపించినా పాపరాజీలు వెంటపడుతూనే ఉంటారు. వాళ్లను చూసి నవ్వుతూనే ఉంటాను. కానీ నాలో మాత్రం ఇంత ఈగర్‌గా ఎందుకు వెయిట్ చేస్తుంటారు? ఇంత డెస్పరేట్‌గా ఎందుకు ఉంటారు? అనే భావన కనిపిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు నా ముఖం మీద మొటికలు కనిపించినప్పుడు, `ఇదేంటి ఇలా అయిపోయింది` అని రాస్తారు. ఇవాళ్టి న్యూస్ పేపర్, రేపటి వేస్ట్ పేపర్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని, అలాంటివాటిని పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాను. వాళ్లూ, వీళ్లూ రాసే అభిప్రాయాలు నా కేరక్టర్‌ని డిసైడ్ చేయలేవు. నేను, నా పనితీరు మాత్రమే తరాలు దాటి నన్ను జనాల్లో నిలబెడుతుంది. ప్రజలు నా మీద ఫోకస్ పెడుతున్నారంటే అది నా అదృష్టం. వారి ఆదరాభిమానాలు నాకు దక్కడం నా అదృష్టం. కానీ నిజమైన వాళ్ల ప్రేమ కోసం కొన్ని టాక్సిక్ విషయాలను భరించాల్సి రావడమే దురదృష్టకరం" అని అన్నారు. ఆమె చేతిలో ఎన్టీఆర్ 30, జనగణమణ సినిమాలు ఉన్నాయి.